*జలాది,క్షీరాది,దాన్యాది వాసం
* ద్వజస్తంబ పునఃహానిర్మాణం
*పూర్ణాహుతి,శాంతికళ్యాణం
కూసుమంతచి ఎప్రేల్30(జనంసాక్షి):మండలంలోని నాయకన్ గూడెంలొ వేంచేసియున్న శ్రీబాలాజి వేంకటేశ్వరస్వామి ద్వజస్తంబపనఃహాప్రతిష్ట కార్యక్రమాలు గతమూడు రోజులుగా ప్రంచప్రతాపురం మత్యగిరిస్వామి,కారంపుడిసువర్ణా
*స్థలపురాణం
ప్రస్తుతం ఇచ్చటయున్న దేవాలయం 90 సంవత్సరాలక్రితం పాలేరు రిజర్వాయర్ నీటి గర్బంయందు యుండెడిది.అనాటి నైజాంనవాబుల పరిపాలనలో చెరువుల నిర్మాణక్రమంలొ బాగంగా వాగుపై కట్టనిర్మాణము చేపట్టగా దేవాలయం,అచటయున్న గ్రామాలు ముంపునకు గురిఅయినవి.ఈ దేవాలయంను అనాడు నైజాంలు ఎగువ ప్రాంతము అయిన ఇచ్చట పునర్ నిర్మానమును చేసినారు. కాలక్రమేన దేవాలయంలోని కొంతబాగం,ద్వజస్తంబం జీర్ణావస్తకు చేరడంతో గ్రామస్తలు తిరుమలతిరుపతి దేవస్తానం పాలకమండలి సభ్యుడు,ప్రస్తుత సత్తుపల్లి శాసనసబ్యుడయిన వెంకటవీరయ్యను ఆశ్రయించగా స్పదించిన యం.ఎల్. ఎ.10%ప్రజలవాటతో 23లక్షల రూపాయలను కేటాయించారు.పనర్ నిర్మాణపనులకు 2017 ఆగఝ్టనెల లో రోడ్లు,భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,సండ్రవెంకట వీరయ్య చేతులమీదుగా శంకుస్తాపన చేసినారు.
*విషిష్ట హోమం.
పునర్ నిర్మాణంలో బాగంగా ఆలయంలో 28వ,తేదిన ప్రత్యేకంగా ఎర్పాటు చేసిన యజ్ఘశాలయందు దేవతామూర్తుల ప్రసన్నం కోసం పండితుల వేదమంత్రాల జపాలతో యజ్ఘశాల ప్రతిద్వనించినది.ఈకార్యక్రమంలో దాతలు పాల్గొన్నారు.
* జలాది,క్షీరాది,దాన్యాది వాసం
ఆలయ పునర్ నిర్మాణంలో బాగంగా 29వ,తేదిన ఉదయం 8గంటలనుండి మద్యాణం 12 గంటల వరకు గ్రామంలోని మహిళలు ప్రత్యేకంగా కొనితెచ్చుకున్న రాగి,ఇత్తడి,స్టీలు బిందెలతో జలము,క్షీరము,పంచామ్రుతాలను తలపై ఉంచుకొని దైవ నామ స్మరాణాలతో ఆలయంలో పునర్ నిర్మాణానికి సిద్దంగాయుంచిన ద్వజస్తంబంపై వాటిని పోసి పులకించిపోయినారు.ఈకార్యక్రమంలో గ్రామ మహిళలు అదికంగా పాల్గోన్నారు.సాయంత్రం దాన్యాదివాసంలో బాగంగా దాతలు,భక్తుల వద్దచేకరించిన నవదాన్యాలను ద్వజస్తంబపైయుంచి ప్రత్యేకపూజలు నిర్వహించారు.
*ద్వజస్తంబ ప్రతిష్ట,శాంతికళ్యాణం
ఆలయ నిర్మాణంలో బాగంగా చివరి రోజైన 30వ,తేది సోమవారంరోజున సరిగ్గా ఉదయం 11.13నిమిషాలకు భక్తుల సందోహంతో గొవిందనామస్మరణాలతో ఆలయ పరిసరప్రాంతం అంతా మార్మొగంగా ద్వజస్తంబ పునఃహాప్రతిష్ట జరిగినది.అనంతరం ఆలయ అబివ్రుద్ది కమిటి ఎర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం జరిగినది. భక్తులు అదికసంఖ్యలో పాల్గొనడం వలన అన్నదాన కార్యక్రమంలో భక్తులు కొంత అసౌకర్యానికి గురయ్యారు.8000మంది భక్తులకు అంచనా వేయగా అంచనాకి మించి భక్తులు రావడం వలన బారిక్యేడ్లు లేమి వలన మంచి నీరు దొరకడం కూడ కష్టమయ్యింది.గ్రామంలోని ప్రతి కుటుంబం తమ బందువులు,మిత్రులను ఆహ్వనించడంతో ఊరంతా పండగవాతవరణం తలపించినది.ఈకార్యక్రమాన్ని గత 30దినములుగా ఆలయ అబివ్రుద్ది కమిటి,పాలకమండలి శ్రమఫలితంగా ఆలయ ద్వజస్తంబపునప్రతిష్ట కార్యక్రమాలు సజావుగా జరిగాయని గ్రామ ప్రజలు తెలిపారు.




