Tuesday, 3 November 2026

రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద భద్రత కట్టుదిట్టం

హైదరాబాద్‌,మార్చి2(జ‌నంసాక్షి): రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద సోమవారం పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. మేజిస్టేట్ర్‌ను అడ్డుకుంటారనే సమాచారంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డులుంటేనే న్యాయవాదులను కోర్టులోకి అనుమతించారు. అదేవిధంగా చార్మినార్‌ సిటీ సివిల్‌ కోర్టు వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. సైబరాబాద్‌ సంయుక్త పోలీస్‌ కమిషనర్‌ శశిధర్‌ బందోబస్తు రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు.  రెండు రోజుల క్రితం ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయలంటూ తెలంగాణ న్యాయవాదులు ఆందోళనకు దిగన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆంధప్రదేశ్‌ లాయర్లపై దాడి చేశారు. దాంతో కోర్టు పరిసరాల్లో బందోబస్తును కట్టుదిట్టం చేశారు.మరోవైపు చార్మినార్‌ సిటీ సివిల్‌ కోర్టు వద్ద కూడా పోలీసులు మోహరించారు.  జడ్జిని అడ్డుకుంటారనే సమాచారంతో ముందస్తు భద్రతను పెంచారు. ఐడీ కార్డులు ఉన్నవారిని మాత్రమే కోర్టులోకి అనుమతించాలని సూచనలను పోలీసులు అమలు చేస్తున్నారు. కాగా జంటనగరాల కమిషనరేట్ల పరిధిలో భద్రతను పెంచినట్లు సీపీ తెలిపారు. మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ కోర్టులో సోమవారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ న్యాయవాదులు నిరసన చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *