తాండూరు మార్చి 24(జనంసాక్షి)
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా తాండూర్ నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులకు రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
ముస్లింలు నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని తెలిపారు. తెలంగాణకు ప్రత్యేకమైన గంగ జమునా తెహజీబ్ సంస్కృతి మరింత పరిఢవిల్లాలని, రంజాన్ పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని శుభప్రద్ పటేల్ అభిలాషించారు.




