Tuesday, 3 November 2026

రజకులను ఎస్సీలో చేర్చాల్సిందే

న్యాయం కోసం ఆయా వర్గాలు ఎదురు చూపు
హైదరాబాద్‌,మార్చి7(జనం సాక్షి): తెలంగాణ ఉద్యమ సమయంలో రజకులను ఎస్సీలలోకి, కాయితీ లంబాడీలు, వాల్మీకి బోయలు, వడ్డెరలను ఎస్టీలలోకి చేరుస్తామని ప్రభుత్వం హావిూ ఇచ్చిందని ఇప్పుడా హావిూ ఏమయ్యిందని ఆయా వర్గాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ముస్లింల రిజర్వేషన్ల నేపథ్యంలో తమ సంగతేంటని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో 6 శాతంఉన్న ఎస్టీ రిజర్వేషన్లను 12శాతానికి పెంచుతామని కూడా అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఈ విషయం గురించి పెద్దగా మాట్లాడటం లేదు. తమ సామాజిక స్థితిని మార్చుకోవాలని రజకులు, వాల్మీకి బోయలు, కాయితీ లంబాడీలు, వడ్దెరలు దశాబ్దాల కాలంగా చేస్తున్న పోరాటాల గురించి పెదవి విప్పడంలేదు. సమాజంలో
నిజంగా అణగారిన వర్గాల వారిని ఆదుకోవడమే ప్రభుత్వ ఉద్దేశం అయితే ఈ వర్గాలు కోరుతున్న విధంగా వారిని ఎస్సీ, ఎస్టీ జాబితాల్లోకి చేర్చడంపై కూడా అసెంబ్లీలో చర్చించాలని కోరుతున్నారు. అందరి ఆమోదంతో ఈ వర్గాల గురించి కూడా ఒక నిర్ణయానికి రావాలి. అలాగే టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో
దివ్యాంగులకు 3 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కూడా హావిూ ఇచ్చింది. కానీ ఈ విషయంగా ఇప్పటివరకు ఎవరూ మాట్లాడటం లేదు. సచార్‌ కమిటీ నివేదిక ప్రభుత్వానికి ఎప్పుడో అందినా గడిచిన మూడేళ్ల కాలంలో దానిని పట్టించుకోకుండా బుట్టదాఖలు చేశారని కొందరు వాదిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత ఇప్పుడు రిజర్వేషన్ల గురించి హడావిడి చేస్తున్నారు. ఇది కేవలం రాజకీయ లబ్ధి పొందాలన్న పథకంతోనే తప్ప సమాజంలో అణగారిన ఆ వర్గాల వారికి మేలు చేయాలన్న ఉద్దేశంతో
కాదన్నది వారి అభిప్రాయం. వాస్తవానికి తమిళనాడులో ముస్లింలకు 3.5 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఇస్తున్నారు. అలాగే అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ, నాగాలాండ్‌, మిజోరం లాంటి రాష్టాల్రలో లో 80 శాతం రిజర్వేషన్లు ఉన్నాయన్నది ప్రభుత్వవాదన. అయితే ఆయా రాష్టాల్రలో అత్యధికంగా గిరిజనులే ఉంటున్న కారణంగా రాజ్యాంగంలో ఇచ్చిన వెసులుబాటు మేరకు వారికి ఆ రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఇవి కాదనగలమా అని అంటున్నారు. వెనకబాటుకు, సామాజిక వివక్షకు గురయిన అనేక వర్గాలకు కూడా న్యాయం చేయాలని కోరుతున్నారు.