రజక సంఘం అనుబంధ కమిటీలను బలోపేతం చేయాలి
మాజీ కౌన్సిలర్ జక్కుల లక్ష్మయ్య –అపార్టుమెంట్ల వాచ్మెన్ల సంఘం కన్వీనర్ గా తెనాలి వీరబాబు ఎన్నిక రఝునాధపాలెం అక్టోబర్ 14. జనం సాక్షి రజక సంఘం కు అనుబంధ కమిటీలను బలోపేతం చేయాలని మాజీ మునిసిపల్, రజక సంఘం సీనియర్ నాయకులు, డీసీఎంఎస్ డైరెక్టర్ జక్కుల లక్ష్మయ్య అన్నారు. శుక్రవారం స్థానిక ద్వంసలాపురం శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ, గోపయ్య స్వామి దేవస్థానం లో జరిగిన రజక సంఘం నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.రజక సంఘానికి అనుబంధ సంఘాలు బలంగా ఉంటేనే రజక సంఘం బలోపేతం అవుతుందని అన్నారు. త్వరలో ఖమ్మం నియోజకవర్గ మహాసభను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా నాయకులు రేగళ్ల సీతారాములు, రేగళ్ల కొండలు మాట్లాడుతూ నగరంలో ఏర్పటు చేసిన డీవిజన్ కమిటీలను పటిష్టపరచాలని అన్నారు. రజక సంఘం కార్యక్రమాలకు డివిజన్ లోని క్రిందిస్తాయి నాయకులకు తప్పకుండా సమాచారం అందించి వారిని సమావేశాలకు హాజరయ్యేటట్లు చూడాలని అన్నారు. ఈ సందర్భంగా రజక సంఘానికి అనుబంధంగా ఖమ్మం నగర అపార్ట్మెంట్ వాచ్‌మేన్ ల సంఘం తాత్కాలిక ఇన్ఛార్జ్ కన్వీనర్ గా తెనాలి వీరబాబు ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు జక్కుల వెంకటరమణ, నగర కన్వీనర్ కణతాల నరసింహా రావు, కండ్రాతి వెంకటేశ్వర్లు, తంగేళ్లపల్లి శ్రీనివాస్, నగర లాండ్రీ షాపుల సంఘం కన్వీనర్ పంతంగి రవికుమార్, గొట్టెపర్తి శ్రీనివాస్, గోలి రామారావు, కొలిపాక వెంకట్, గడ్డం ఉపేందర్, వట్టికోట దర్గయ్య, కాకులహారం నరసింహా, రేగుముడి రామకృష్ణ, లింగoపల్లి సైదులు, పగిల్లపల్లి రాజు, బోనగిరి ఉపేందర్, సట్టు మంగ, కొత్తపల్లి పుష్ప, సట్టు శ్రీనివాస్, సట్టు సత్యనారాయణ, మణిగ కోటయ్య, మంకెన నాగరాజు,దాచేపల్లి నరేష్, తదితరులు పాల్గొన్నారు.