*రజాకార్లను తరిమికొట్టిన వీరనారి చాకలి ఐలమ్మ- ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్*

*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : రజాకార్లను తరిమికొట్టిన వీరనారి చాకలి ఐలమ్మ అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు.
శంషాబాద్ ఎంపిపి జయమ్మ శ్రీనివాస్ సొంత నిధులతో ఏర్పాటు తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని సోమవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద తుప్పరలో ఏర్పాటుచేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రజాకా పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. రజాకర్లను తుద ముట్టించి దొరల పాలలను అంతం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అన్నారు. ఆమె ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నీరటీ తన్వీరాజ్,వైస్ ఎంపిపి నీలం మోహన్ నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మెన్ బండి గోపాల్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ వెంకటేష్ గౌడ్,కౌన్సిలర్ ఆయిల్ కుమార్,సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు దండు ఇస్తారి, నాయకులు గణేష్ గుప్త,శ్రీనివాస్ గౌడ్,మోహన్ రావు,మంచెర్ల శ్రీనివాస్, ప్రసాద్, సర్పంచులు, ఎంపిటీసిలు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : పెద్ద తుప్పరలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.
Attachments area