హైదరాబాద్,మే25(జనంసాక్షి): సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ చిత్రానికి అసభ్యకరంగా ఉన్న ఓ మహిళ ఫొటోను మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన వ్యక్తిపై పంజాగుట్ట పోలీసులు కోర్టు ఆదేశం మేరకు కేసు నమోదు చేశారు. పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ రవీందర్, ఎస్సై శ్రీనివాసులు కథనం ప్రకారం.. ఫేస్‌బుక్‌లో తన ఫొటోను అసభ్యకరంగా మార్ఫింగ్ చేశారని ఇటీవల రామ్‌గోపాల్ వర్మ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించి న్యాయనిపుణుల సలహా మేరకు గురువారం కేసు నమోదు చేశారు. రాంగోపాల్ వర్మ వద్ద గతంలో స్క్రిప్ట్ రైటర్‌గా పని చేసిన చిక్కడపల్లికి చెందిన పి.జయకుమార్ (27) ఈ పని చేసినట్లుగా విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేశారు.




