న్యూడిల్లీ : దేశరాజధానిలో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో కీలక నిందితుడు రాంసింగ్ ఆత్మహత్య చేసుకున్నా ఘటనపై తీహార్ జైలు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఆత్యంత కట్టుదిట్టమైన భద్రత, నిఘా ఉండే తీహార్ జైల్లో ఈ ఘటన చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనలో నిందితులు ఆత్మహత్యకు పాల్పడే అవకాశం ఉండటంతో తీహార్ జైల్లో వారిని వేర్వేరుగా ఉంచి జనవరి నుంచి నిరంతరం నిఘా కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో రాంసింగ్ ఆత్మహత్య చేసుకోవడంతో జైలు అధికారులు విచారణకు ఆదేశించారు. మృతదేహాన్ని పోరస్ట్‌మార్టమ్ నిమిత్తం దీన్‌దయాల్ ఆసుపత్రికి తరలించారు.




