రాగి జావా పిల్లలకు ఎంతో శ్రేయస్కరం
*****
సైదాపూర్ జనం సాక్షి జనవరి 2(లస్మన్నపల్లి) విద్యార్థిని విద్యార్థులకు బెల్లంతో తయారుచేసిన రాగి జావా ఎంతో శ్రేయస్కరమని వెన్నం పెల్లి సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేతిరి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం ఆధ్వర్యంలో సాయి ట్రస్టు ద్వారా సరఫరా చేసిన రాగిజావ పంపిణీ సర్పంచ్ కాయిత రాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ… చిన్నారులకు రక్తహీనత లేకుండా రోగనిరోధక శక్తి పెరిగేందుకు బెల్లంతో తయారుచేసిన రాగిజావను ప్రభుత్వం అందిస్తుందన్నారు. పాఠశాలకు వచ్చిన అనంతరం ఉదయం పది గంటలకు ఈ జావాను విద్యార్థులు సేవించాలన్నారు. పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటేనే విద్యలో ముందుకు పోతారని ఆయన తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ మంచి పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, క్రమం తప్పకుండా రాగిజావను సేవించాలని అన్నారు. వారంలో మూడు రోజులపాటు ఈ జావను చిన్నారులకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీలక్ష్మి, ప్రధానోపాధ్యాయురాలు కవిత, ఉపాధ్యాయురాలు అర్చన ,ఉప సర్పంచ్ మ్యాకల మల్లారెడ్డి, అంగన్వాడి టీచర్ స్వరాజ్యం, గ్రామస్తులు పాల్గొన్నారు
రాగి జావా పిల్లలకు ఎంతో శ్రేయస్కరం




