రాజకీయంగా భూ స్థాపితం చేయాలని నాపై కాంగ్రెస్ కుట్ర..! – ప్రజా ఆశీర్వాద యాత్రలో టిఆర్ఎస్ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్
జనంసాక్షి, కమాన్ పూర్ : ఒక బీసీ నాయకుడు రాజకీయంగా ఎదగడాన్ని ఓర్వలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ తనను రాజకీయంగా భూస్థాపితం చేయాలని కుట్ర పన్నుతున్నదని బిఆర్ఎస్ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ ఆరోపించారు. పుట్ట మధు చేపట్టిన ప్రజా ఆశీర్వాద యాత్ర చివరి రోజు కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామం నుంచి ప్రారంభమై రామగిరి మండలం మీదుగా మంథని మండలానికి చేరుకుంది. జూలపల్లి లో పుట్ట మధుకర్ మాట్లాడుతూ.. తనపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ప్రజల నుంచి దూరం చేయాలనే కుట్ర కుతంత్రాల రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ తెర లేపిందన్నారు. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో సైతం ఇలానే తనపై ఆధారాలను లేని ఆరోపణలు చేసి ప్రజలను నమ్మించి తన ఓటమికి కారణమయ్యారని, ఈసారి ఎన్నికల్లో అలా జరగకుండా ఉండాలని ప్రజలను చైతన్యవంతం చేయడం కోసమే ఈ ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టినట్లు పుట్ట మధు స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో తనను మంథని ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే కాకుండా అన్ని వర్గాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జూలపల్లి సర్పంచ్ బొల్లపల్లి శంకర్ గౌడ్, ఉప సర్పంచ్ సాయికుమార్, ఎంపీటీసీ అబిడి వినోద, ఆమె తనయుడు అబిడి సంతోష్ రెడ్డి తో పాటు బిఆర్ఎస్ నాయకులు, ఒగ్గు కళాకారుల డోలు దెబ్బల మధ్య, డప్పు చప్పుల మధ్య, మహిళల కోలాటాల మధ్య మధుకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని పలువురు మహిళలు పుట్ట మధుకు మంగళహారతులతో వీర తిలకం దిద్ది స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీపీ రాచకొండ లక్ష్మీ రవి, నాయకులు ఇనుగంటి రామారావు, ఇనుగంటి భాస్కరరావు, నీలం సరిత శ్రీనివాస్, గడప కృష్ణమూర్తి, దాసరి రాజలింగు, ఉప్పరి శ్రీనివాస్, తాటికొండ శంకర్, బోనాల వెంకటస్వామి, కోలేటి శేఖర్, బొల్లపల్లి లక్ష్మా గౌడ్, బొజ్జ సాగర్, కొండ్ర స్టాలిన్ గౌడ్, మచ్చ గట్టయ్య, టిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు బొమ్మగాని అనిల్, మెరుగు వెంకటేశం, ఇరుగురాల చందర్, భూపెల్లి జ్యోతి పాటు అధిక సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




