హైదరాబాద్ : దేశంలోని రాజకీయ పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. 69వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి దేశ ప్రలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు….పదేళ్లు దేశ ఆర్థిక ప్రగతి ప్రసంశనీయంగా ఉందని అన్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న బంగ్లాదేశ్ సరిహద్దు సమస్య పరిష్కారమైందని ఆయన అన్నారు. ఉగ్రవాదులకు సిద్ధాంతం, మతం లేదని ప్రణబ్ విమర్శించారు. ఇటీవల కశ్మీర్‌లో పాక్ ఉగ్రవాది నవీద్‌ను పట్టుకున్న పౌరులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.




