Wednesday, 4 November 2026

గోల్కొండ వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

  • 0
    Share

హైదరాబాద్: గోల్కొండ కోటకు వెళ్లే మార్గాల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చారిత్రక గోల్కొండ కోటలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు రామ్‌దేవ్‌గూడ నుంచి గోల్కొండ కోటకు వెళ్లే రహదారిని మూసివేశారు. పాస్‌లు ఉన్న వాహనాలను గోల్కొండ కోట వరకు అనుమతిస్తున్నారు. వాహనాలు నిలపడానికి అధికారులు ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *