*రాజీనామా వాపసు తీసుకున్న ధారాసింగ్*

పెద్దేముల్ అక్టోబర్ 22 (జనం సాక్షి)
ఇటీవల పెద్దేముల్ మండల జడ్పిటిసి ధారాసింగ్ నాయక్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా శనివారం తాండూరులో టిపిసిసి ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తనను టీపీసీసీ డెలిగేట్ పదవి నుండి తప్పించినందుకు కలత చెంది పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. పార్టీ పెద్దలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు జెడ్పిటిసి ధారాసింగ్ నాయక్ వెల్లడించారు.కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. ఈనెల 31న రాహుల్ గాంధీ నిర్వహించే భారత్ జోడో యాత్రకు శంషాబాద్, షాద్‌నగర్ కు తాండూర్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించి భారత్ జోడో యాత్రను విజయవంతం చేస్తామని తెలిపారు.
Attachments area