Wednesday, 4 November 2026

రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించిన డిసిసి అధ్యక్షులునందికంటి శ్రీధర్

అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 20
 భారతదేశం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు అల్వాల్ పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించిన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహానికిపూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నందికంటి శ్రీధర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ తీసుకువచ్చిన సంస్కరణల వల్లనే దేశంలో ఐటీ ని అగ్రగామిగా నిలిపిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కిందని దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం రాజీవ్ గాంధీ కుటుంబం అని గుర్తు చేశారు. ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అనేకమైన సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిమ్మ అశోక్ రెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాస్, సిఎల్ యాదగిరి, సూర్య ప్రకాష్ రెడ్డి, ప్రవీణ్, టీఎస్ సంజీవ్ కుమార్, సాయికుమార్, పాండు, సంతోష్ రెడ్డి, ఓంకార్, రాజు, పద్మ, పాహీం, తదితరులు పాల్గొన్నారు.