Friday, 6 November 2026

రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం


గ్యాస్‌సిలిండర్‌ పేలుడు…40 గుడిసెలు దగ్ధం

హైదరాబాద్‌, మార్చి 20 : నగరంలోని రాజేంద్రనగర్‌ హైదర్‌గూడలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నల్లంద కాలనీలోని ఓ ఇంట్లో గ్యాస్‌ లీకై మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ ఒక్కసారిగా గాలి వీచడంతో పక్కనే ఉన్న గుడిసెలకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 40 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే గుడిసెలోని ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.
ఎలాంటి ప్రాణ నష్టం కలుగనప్పటికీ దాదాపు రూ.4 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ఐదు ఫైరింజన్లతో మంటల అదుపునకు యత్నిస్తున్నారు. అగ్నిప్రమాదంతో గుడిసెలలో నివాసముంటున్న వారు రోడ్డునపడ్డారు. ఈ ప్రమాదానికి గ్యాస్‌సిలిండర్‌ పేలుడు కారణమా లేక మరేదైనా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *