కేంద్ర,రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తున్నాం
జిఎస్టీని మూడు శ్లాబులు చేస్తాం
ప్రజలపై భారాన్ని తగ్గించి చూపుతాం
మహిళల అభవృద్ది కాంగ్రెస్‌తోనే సాధ్యం
మహిళా సంఘాలతో ముఖాముఖిలో పాల్గొన్న రాహుల్
ఎఐసిసి అధ్యక్ష హోదాలో తొలిసారి విచ్చేసిన రాహుల్‌కు ఘన స్వాగతం
హైదరాబాద్,ఆగస్ట్13(జనం సాక్షి): రానున్న ఎన్నికల్లో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధీమా వ్యక్తంచేశారు. తాము అధికారంలోకి రాగానే అభయహస్తం పింఛను పథకం, మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలను పునరుద్ధరిస్తామని చెప్పారు. మహిళలను అభివృద్ధిలోకి తీసుకురావడం ఎలాగో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే తెలుసని వ్యాఖ్యానించారు. అలాగే జిఎస్టీ స్లాబుఏలను తగ్గించి మూడు శ్లాబులు చేసత్‌ఆమని, ప్రజలపై భారం పడకుండా చూస్తామని అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్ చేరుకున్న ఆయన.. శంషాబాద్‌లోని క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్‌లో మహిళా స్వయం సహాయక బృందాలతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి రాష్ట్రానికి విచ్చేసిన నేపథ్యంలో ఆయనకు పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. అనంతరం శంషాబాద్‌లోని క్లాసిక్ కన్వెన్షన్‌లో మహిళా స్వయం సహాయక బృందాలతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు. దేశం ముందుకు పోవాలంటే మహిళలు, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని నా నమ్మకం అని రాహుల్ అన్నారు. మహిళలు అభివృద్ధి చెందకుండా దేశం ముందుకుసాగదన్న విషయాన్ని తమ పార్టీ విశ్వసిస్తుందని తెలిపారు. ఇప్పుడున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను పూర్తిగా విస్మరిస్తున్నాయని విమర్శించారు. మహిళలను వంటింటికే పరిమితం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఈ పని కాంగ్రెస్ పార్టీకి తెలుసు ఆ విధంగా ముందుకు పోతాం. మహిళలు ఎదగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి.’ అని రాహుల్ పేర్కొన్నారు. మరో మహిళ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. జీఎస్టీ అంటే తెలుసా అని ప్రశ్నించాడు. జీఎస్టీ అంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని ప్రభుత్వం దోచుకునే విధానమని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే పన్ను విధానాన్ని అమలు చేస్తామన్నారు. రెండేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం 15 మంది పారిశ్రామికవేత్తలకు రూ.2.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిందని, రైతులకు, మహిళలకు స్వయం సహాయక బృందాలకు మాత్రం రుణాలు మాఫీ చేయడం లేదని రాహుల్ ఎద్దేవాచేశారు. దేశం ముందుకు సాగాలంటే మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని అన్నారు. తాము అధికారంలోకి వస్తే బ్యాంకుల ద్వారా డ్వాక్రా మహిళలకు రుణాలు నేరుగా అందించేందుకు ఏర్పాటు చేస్తామని చెప్పారు. డ్వాక్రా మహిళలే ఉద్యోగాలు ఇచ్చేలా స్వయం సాధికారత సాధించేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. తెలంగాణలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తంచేశారు. మహిళల రుణాలు, రైతు రుణాలు మాఫీ చేసేందుకు మోదీ, కేసీఆర్ నిరాకరిస్తున్నారని అన్నారు. 2016 నవంబర్ 8న ప్రధాని మోదీ నోట్ల రద్దు చేశారని, దేశ ప్రజలంతా గంటలకొద్దీ బ్యాంకుల వద్ద లైన్లలో నిల్చున్నారని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. బ్యాంకుల్లో రూ.12.లక్షల కోట్లు నిరర్థక ఆస్తులుగా మిగిలిపోయాయని, నల్లధనంపై యుద్ధం చేస్తానన్న మోదీ.. ప్రజల జేబులోంచి డబ్బు తీసుకుని బ్యాంకుల్లో వేశారని అన్నారు. ప్రజలు కష్టపడి బ్యాంకులో వేసిన డబ్బును మోదీ పారిశ్రామికవేత్తలకు రాయితీల రూపంలో ఇస్తున్నారని పేర్కొన్నారు. జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కాదని, అది గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని రాహుల్ ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒకే విధమైన పన్ను ఉంటుందని, అసలైన జీఎస్టీ అంటే ఏమిటో చూపిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తమ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ పాలనలో నాలుగున్నరేళ్లుగా అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కేబినేట్, శాసనమండలిలో ఒక్క మహిళా కూడా లేరని, మహిళా సంఘాలను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో 6 లక్షల మహిళా సంఘాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళా శక్తి ద్వారా కేసీఆర్‌ను తరిమేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళా సంఘాలకు లక్ష గ్రాంట్, ప్రమాద బీమాను 5 లక్షలు ఇస్తామని ఆయన హావిూ ఇచ్చారు. ఈ సమావేశంలో మహిళలు అడిగిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ సమాధానమిచ్చారు. వీరికి సమన్వకర్తగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన మాధవి మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలను పట్టించుకోవడం లేదని, లోన్లు కూడా ఇవ్వడం లేదని. అభయహస్తం పథకం నిర్వీర్యం చేస్తుందని రాహుల్ దృష్టికి తీసుకొచ్చింది. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘రెండేళల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 15 మంది పారిశ్రామిక వేత్తలకు 2.5లక్షల కోట్లు రుణం మాఫీ చేసింది. సామాన్యులకు చేసేందేం లేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా పెద్ద పారిశ్రామిక వేత్తలకే రుణాలు ఇస్తోంది. అధికారంలోకి వస్తే వడ్డీ భారం తమ ప్రభుత్వమే భరిస్తోంది. అభయ హస్తం స్కీమ్‌ను కూడా పునరుద్దరిస్తాం. ఇది మహిళల హక్కు అన్నారు. తాము అధికారంలోకి రాగానే ప్రతి మహిళా సంఘానికి రూ.లక్ష గ్రాంట్ ఇవ్వనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
గడిచిన నాలుగున్నరేళ్లలో తెరాస ప్రభుత్వం మహిళలకు అన్యాయం చేసిందన్నారు. తెరాస మంత్రి వర్గంలో ఒక్కరు కూడా మహిళ లేరని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో జైపాల్క రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
——-




