Wednesday, 4 November 2026

రానున్న ఎన్నికల్లో బీజేపీదే అధికారం

రానున్న ఎన్నికల్లో బీజేపీదే అధికారం

పెనుబల్లి, డిసెంబర్ 4(జనం సాక్షి)
తెలంగాణాలోరానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ ను ఢీ కొట్టి అధి కారం లోకి వచ్చేది బీ జేపి ఏ నని నియోజక వర్గం ఇన్ ఛార్జ్ కనగాల వెంకటరామయ్య అన్నారు, అదివారం పెనుబల్లి మండల బీజేపీ అధ్యక్షులు బొర్రా నరసింహారావు ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశంపెనుబల్లి లొ జరిగింది.ఈ సమావేశానికి కనగాల వెంకటరామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలవబోతుందని, టిఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయ శక్తి అని అన్నారు, తెలంగాణ ప్రజానీకం బీజేపీ కి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ శ్రేణులు ఆ దిశగా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.కేసిఆర్ సర్కారు అన్ని విధాలుగా విఫలమైందని, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటుందని విమర్శించారు,
జిల్లా కార్యదర్శి నాయుడు రాఘవరావు మాట్లాడుతూ ఇకపై కేసిఆర్ కల్లబొల్లి కబుర్లు తెలంగాణ ప్రజానీకం నమ్మే స్థితిలో లేదని, కేసీఆర్ మద్యం కుంభకోణం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కూతురుని కాపాడుకొనే పనిలో ఉన్నారని,ఈ మద్యం కేసులో ఇరుక్కున్న తన కూతురి విషయాన్ని పక్కదారి పట్టించటం కోసం రోజుకో కొత్త డ్రామా ఆడుతున్నారని,తన ఓటమిని ముందే పసిగట్టి బీజేపీ మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, కానీ తెలంగాణ ప్రజానీకం అన్ని విషయాలను గమనిస్తున్నారని, కేసీఆర్ సర్కారు కు చరమగీతం పాడటం ఖాయమన్నారు.ఈ సందర్భంగా నూతనంగా బిజెపి పార్టీ లో చేరిన. వారికి కనగాల వెంకటరామయ్య కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుదర్శన్ మిశ్రా, నియోజకవర్గ కన్వీనర్ భాస్కర్ణి వీరంరాజు, మండల ప్రధాన కార్యదర్శి రాము, పేర్ల మహేష్, చారి, రమేష్,సత్యనారాయణ, శ్రీనివాసరావు, పార్టీ లో నూతనంగా చేరిన
నవీన్, యెరుగట్లకి కి చెందిన తర్లికోండ మోహనరావు, చిట్టిమళ్ల మొగిలి, లంకపల్లికి చెందిన జక్కుల జోసెఫ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.