రామగిరి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా దాసరి శివ

 జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా
రామగిరి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా దాసరి శివ నియామకమయ్యారు. ఏఐసీసీ కార్యదర్శి మంథని శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాలతో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జెమిని గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు. తన నియామకానికి సహకరించిన శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీను బాబు,మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, రామగిరి మండల పార్టీ అధ్యక్షులు తోట చంద్రయ్య,మంథని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బర్ల శ్రీనివాస్, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి కొప్పుల గణపతి, బిసి సెల్ రామగిరి మండల అధ్యక్షులు బండారు సదానందం, ఎస్సి సెల్ రామగిరి మండల అధ్యక్షులు కండే పోచం, మహిళ మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు పబ్బతి రాదారెడ్డి, ఎన్టీయుసి అర్జీ 3 ఉపాధ్యక్షుడు కోట రవీందర్ రెడ్డిలతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులకు కార్యకర్తలకు దాసరి శివ కృతజ్ఞతలు తెలిపారు.