– బీజేపీ ఓటమి దిశగా పొత్తులుండాలని నిర్ణయించాం
– తెలంగాణలో జనసమితితో కలిసే అవకాశం ఉంది
– కేసీఆర్ ఫ్రంట్ ఏకాకిగా మిగులుతుంది
హైదరాబాద్, మే1(జనం సాక్షి) : కేరళలో సీపీఐ జాతీయ మహాసభలు విజయవంతం అయ్యాయని ఆ పార్టీ నేత సురవరం సుధాకర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం విూడియాతో మాట్లాడుత బీజేపీ మతోన్మాద శక్తులు, కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని… బీజేపీని ఓడించే దిశగా పొత్తులుండాలని నిర్ణయించామని చెప్పారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా వేదిక ఏర్పాటుకు సీపీఐ ప్రయత్నాలు చేస్తోందన్నారు. రాజకీయ విధానంపై టీఆర్‌ఎస్‌తో తమకు రాజకీయ విబేధాలున్నాయని సురవరం తెలిపారు. తెలంగాణ జనసమితితో కలిసి పనిచేసే అవకాశం ఉందని చెప్పారు. బీజేపీని ఓడించేందుకు జాతీయ స్థాయిలో అవగాహన కష్టమన్న సురవరం రాష్టాల్ర వారీగా పొత్తులుంటాయని స్పష్టం చేశారు.
కేసీఆర్ మూడో ఫ్రంట్ ఏకాకిగా మిగలబోతోందని సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీకి మేలు చేయడం కోసమే కేసీఆర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారని.. కేసీఆర్ ఫ్రంట్‌ను అమిత్‌షా స్వాగతించడమే దీనికి నిదర్శనమన్నారు. రాజకీయంగా అవగాహన ఉన్నవారెవరూ కేసీఆర్ ఫ్రంట్‌లో చేరరని ఆయన తెలిపారు. వామపక్షాలు, కలిసొచ్చే పార్టీలతో ఐక్య వేదిక ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని సురవరం పేర్కొన్నారు.




