Wednesday, 4 November 2026

రాష్ట్రంలో విద్యా, వైద్యానికి పెద్ద పీట వేస్తున్నా సిఎం కెసిఆర్ : విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )   పేద వారికి ఉచితంగా వైద్యం అందించటానికి  బస్తీ   దవాఖానాలు ఎంతగానో దోహదం చేస్తాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు  ,  జల్ పల్లి మునిసిపాలిటీ శ్రీరామ కాలనిలో బస్తీ దవాఖాననుముఖ్య అతిథిగా హాజరైన    విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా   ప్రారంభించారు . అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి  మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్  రాష్ట్రంలో విద్యా, వైద్యానికి పెద్ద పీట వేస్తున్నారని అన్నారు. మన ఊరు- మన బడి,మన బస్తీ- మన బడి కార్యక్రమానికి  7 వేల కోట్లు కేటాయించి ప్రభుత్వ బడులకు మహర్దశ వచ్చేలా ప్రభుత్వం కృషి.
నగర శివారు ప్రాంతాల్లో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆస్పత్రుల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్  నిర్ణయించారు.ఒక్కో ఆస్పత్రిని 1200 కోట్లతో మహేశ్వరం-ఎల్ బి నగర్ నియోజకవర్గాల పరిధిలో గడ్డి అన్నారం వద్ద,మేడ్చల్,సనత్ నగర్,గచ్చిబౌలి లలో వీటిని నెలకొల్పనున్నారు. పట్టణాల్లో బస్తీ దవాఖానాలు, గ్రామాల్లో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తూ ప్రజల చెంతకు వైద్యాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ..,హైదరాబాద్ లో ఇప్పటికే 300 పైచిలుకు,రంగారెడ్డి జిల్లాలోని మునిసిపాలిటీలలో మొదటి దశలో 22 ,రెండవ దశలో 14 మొత్తం 36 బస్తీ దవాఖానాలు మంజూరు అయ్యాయన్నారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో మొత్తం 10 బస్తీ దవాఖానాలు మంజూరు కాగా,  ఇందులో 4 జల్ పల్లి మునిసిపాలిటీ లలో ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి బస్తీ దవాఖానలో ఒక డాక్టర్,స్టాఫ్ నర్స్,నర్స్ లు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారు ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ,పేద వారికి ఉచితంగా వైద్యం అందించటానికి ఈ దవాఖానాలు ఎంతగానో దోహదం చేస్తాయని తెలిపారు .