Monday, 2 November 2026

రాష్ట్రంలో 12 ఆలయాలకు పాలక మండళ్ల నియామకం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని పలు ఆలయాలకు పాలక మండలి సభ్యులను దేవాదాయ శాఖ నియమించింది. 12 ఆలయాలకు పాలక మండళ్లను ఏర్పాటు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పాలక మండళ్లను ఏర్పాటు చేసిన వాటిలో వరంగల్‌ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి, మహబూబ్‌ బాద్‌ జిల్లా కురవి వీరభద్ర స్వామి, పెద్దపల్లి జిల్లా ఓదేల మల్లికార్జున స్వామి వంటి ప్రముఖ ఆలయాలతో పాటు చిన్న దేవాలయాలున్నాయి. జంట నగరాల్లోని షేక్‌ పేట్‌- బంజరాహిల్స్‌ రోడ్‌ నం.1 హనుమాన్‌ టెంపుల్‌, బంజారాహిల్స్‌ రోడ్డు నం.1 మరియు 12 లోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం, మేడ్చల్‌-మల్కాజ్‌ గిరి జిల్లా వాణీ నగర్‌ విజయ వినాయక దేవాలయం,సూర్య?పేట జిల్లా మేళ్లచెర్వు స్వయంభు శంబులింగేశ్వర స్వామి దేవాలయం,నల్గొండ జిల్లా కేంద్రం పానగల్‌ రోడ్డు రేణుక ఎల్లమ్మ ఆలయం, షేర్‌ బంగ్లా కాలనీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం, రామగిరి కాలనీ సీతారామచంద్ర స్వామి ఆలయం, తులసీ నగర్‌ కాలనీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం, పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ల లక్ష్మీనర్సింహ స్వామి ఆలయాలకు పాలక మండలి సభ్యులను నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులిచ్చింది.