రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము గెలుపు పట్ల హర్షం చేస్తూ బీజేపీ విజయోత్సవ ర్యాలీ..మిఠాయిల పంపిణీ.
తొర్రూర్ 21 జూలై( జనంసాక్షి )
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము గారు అఖండ విజయం సాధించి భారత 15వ నూతన రాష్ట్రపతి గా ఎన్నికవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు తొర్రూర్ లో బిజెపి ఎస్టీ మోర్చ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేయడం జరిగింది.గిరిజన మహిళలు తమ సాంప్రదాయ అలంకరణ తో స్థానిక గెస్ట్ హౌస్ సెంటర్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్చార్జి పెదగాని సోమయ్య, బీజేపీ రాష్ట్ర నాయకులు ఉమ్మడి వరంగల్ జిల్లా శిక్షణ తరగతుల కన్వీనర్ పాకనాటి దామోదర్ రెడ్డి లు సంయుక్తంగా మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్దించి డెబ్బై ఏళ్ళు నిండినా ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి ఎన్నికవడం ఇదే మొదటిసారి సారి అని తెలిపారు.బీజేపి పార్టీ గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ము గారికి రాష్ట్రపతి గా అవకాశం కల్పించి గిరిజనుల పక్షపాతిగా మారింది అని తెలిపారు.బీజేపి పార్టి అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా గతంలో రామ్ నాథ్ కోవింద్ గారిని రాష్ట్ర పతి చేసి,నేడు ద్రౌపది ముర్ము గారికి రాష్ట్రపతి అవకాశం కల్పించి సామాజిక న్యాయం పాటిస్తూ అన్ని వర్గాల ప్రజల కోసం పాటుపడుతూ సభ్ కా సాత్ సభ్ కా వికాస్ నినాదం ఎత్తుకొని బీజేపీ పనిచేస్తుంది అని తెలిపారు.గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ము గారికి రాష్ట్రపతి ఎన్నికల్లో కేసిఆర్ మద్దతివ్వకుండా గిరిజన ద్రోహి గా మారిపోయాడు అని తెలిపారు.రాష్ట్రపతి ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ద్రౌపది ముర్ము గారు దేశ భవిష్యత్తు పై మార్గదర్శనం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు పరుపాటి రాం మోహన్ రెడ్డి,15వ వార్డు కౌన్సిలర్ కొలుపుల శంకర్,కస్తూరి పులేందర్,రాయపురం రాజకుమార్,పైండ్ల రాజేష్,గడల శేఖర్, మంగళపళ్ళి యాకయ్య, నడిగడ్డ ఉపేందర్, జలగం వెంకన్న,నర్కుటి ఛలపతి రాజ్,గట్ల భరత్, నూకల నవీన్,వినయ్ శర్మ,జలగం రవి,నడిగడ్డ సందీప్,మచ్చ ఉదయ్,శ్రీనాథ్,అంజీ,యాకన్న, ప్రవీణ్,గంధం రాజు, తదితరులు పాల్గొన్నారు.
Attachments area
|