Wednesday, 4 November 2026

రాష్ట్రపతి ప్రణబ్‌ బస ప్రాంతం వద్ద స్వల్ప పేలుడు

ఢాకా : బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ బస చేసిన సనర్‌గా వ్‌ – పసిఫిక్‌ హోటల్‌ వద్ద సోమవారం స్వల్ప పేలుడు సంభవించింది. ఆందోళనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌లో రాష్ట్రపతి పర్యటన ఆదివారం ప్రారంభమైంది. దేశంలో నెలకొన్న హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్‌ బస చేసిన సనర్‌గావ్‌ హోటల్‌ వద్ద ఆందోళన కారులు నాటుబాంబులు పేల్చారు. భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *