Wednesday, 4 November 2026

దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసు ఎన్‌ఐఏకు అప్పగింత

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసును చేధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో సరికొత్త నిర్ణయం తీసుకుంది. పేలుళ్ల కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సమీక్షా  సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… ఎన్‌ఐఏ పరిధి విస్త్రృతంగా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఘటనకు ఆస్కారం ఉందని అనుమానం ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు విస్త్రృతం చేసినట్లు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *