హైదరాబాద్,జూన్ 5(జనం సాక్షి ): సోషల్ విూడియాలో వస్తున్న రూమర్లు నమ్మవద్దంటు రాచకొండ సీపీ మహేష్ భగవత్ కోరారు. ఈ సందర్భంగా ప్రజల్ని చైతన్య పరిచేందుకు ఎల్బీనగర్ ట్రాఫిక్ అదనపు ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు రచించి పాడిన ఆడియో, వీడియో పాటల సీడీని క్యాంప్ కార్యాలయంలో భగవత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ, గ్రావిూణ ప్రాంతాలలో విస్తృతంగా అవగాహన కల్పించాలినే ఉద్దేశ్యంతో ఈ పాటల సీడీని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలోరూపొందించినామని తెలిపారు, కొత్తవారు కనిపిస్తే కొట్టిచంపద్దు అని, అనుమానం వస్తే 100కి ఫోన్ చెయ్యాలని లేదా రాచకొండ వాట్స్ యాప్ నెంబర్ 9490617111 సమాచారం అందించాలని కోరారు. రాచకొండ పోలీస్ వారికి రక్షణగా ఉంటుందని తెలిపారు. మంచిగా అర్థవంతంగా పాటలని పాడిన ఇన్స్పెక్టర్ నాగమల్లును ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అడిషనల్ డీసీపీలు దివ్యచరన్ రావు, మనోహర్, ఏసీపీ నర్సింహారెడ్డి, సిఐ జనాకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




