Tuesday, 3 November 2026

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ క‌విత‌

హైద‌రాబాద్‌: తెలంగాణ జాగృతి వ్య‌వ‌స్థాప‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇవాళ ఆమె త‌న ట్విట్ట‌ర్‌లో ఓ పోస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇవాళ ప‌ద‌వ అవ‌త‌ర‌ణ దినోత్స‌వం జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని ఆమె పోస్టు చేశారు. తెలంగాణ ట‌ర్న్స్ 10 అన్న హ్యాష్‌ట్యాగ్ కూడా త‌న పోస్టులో పెట్టారు.