హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల సంఘానికి పిసీసీ అద్యక్షుడు బొత్స సత్యనారాయణ లేఖ రాశారు. ఈ లేఖలో మూడు దశల పోలింగ్‌కు విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల రెండో దశ, మూడో దశ పోలింగ్‌కు ఎక్కువ రోజులు లభిస్తాయని ఆయన లేఖలో పేర్కొన్నారు.




