Tuesday, 3 November 2026

రాష్ట్ర బడ్జెట్‌పై కేంద్ర ప్రభావం ఉంటుందన్న యనమల

12న ఆంధప్రదేశ్‌ సాధారణ బడ్జెట్‌ ..27 వరకు సభ
హైదరాబాద్‌,మార్చి2(జ‌నంసాక్షి): ఆంధప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 7వ తేదీ నుంచి 27 వరకూ జరుగుతాయని ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.  7న గవర్నర్‌ ప్రసంగం, 12న సాధారణ బడ్జెట్‌, 13న వ్యవసాయ బడ్జెట్‌ ఉంటుందన్నారు. కేంద్ర బడ్జెట్‌ ప్రభావం రాష్ట్ర బడ్జెట్‌పై కొంత ఉంటుందని యనమల సోమవారమిక్కడ విలేకర్ల సమావేశంలో అన్నారు. కేంద్ర బడ్జెట్‌ను అధ్యయనం చేస్తున్నామని, వాటికి అనుగుణంగానే బడ్జెట్‌ కేటాయింపులు ఉంటాయన్నారు. ఈ లోగా సిఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి  కేంద్రంతో చర్చిస్తారని అన్నారు. నిధుల కేటాయింపులో ఎపికి జరిగిన అన్యాయచం వల్ల దాని ప్రభావం మన బడ్జెట్‌పైనా ఉంటుందన్నారు. అయితే కొత్తగా పన్నులు పెంచే ఆలోచన లేదని, ఉన్న పన్నులను సక్రమంగా వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే లక్షకోట్ల వరకు బడ్జెట్‌ ఉంటుందన్నారు. అలాగే ప్రణాళికేతర వ్యవయాన్ని తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు. లెవీ సేకరణ 25 శాతానికి తగ్గించడం, ఆయిల్‌ ధరలు పెరగడం వల్ల ఆదాయం తగ్గిందని యనమల అన్నారు. కేంద్రం ఇటీవల ప్రకటించిన రూ.850 కోట్లు విడుదలయ్యాయన్నారు. ఏసీడీపీ నిధుల కేటాయింపుపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని యనమల తెలిపారు. ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గిస్తామని ఆయన పేర్కొన్నారు. కొన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటనలు చేస్తామని యనమల వెల్లడించారు. 7న ఉదయం 8.55 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారని అన్నారు. అలాగే 12న తాను బడ్జెట్‌ ప్రవేశ పెడతానని,13న ప్రత్తిపాటి వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశ పెడతారని  అన్నారు.  లక్ష కోట్లకు తక్కువ కాకుండా బ్జడెట్‌ ఉంటుందని, రాజధానికి భూములిచ్చిన రైతులకు వార్షిక చెల్లింపులు ఉంటాయని ఆయన తెలిపారు. రైతులకు చెల్లించేందుకు ప్రత్యేకమైన కేటాయింపులు ఉంటాయన్నారు. రైతులకు ఎలాంటి సందేహాలు అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. వారికి బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని అన్నారు.  ప్రణాళికేతర వ్యయం తగ్గించేందుకు కృషిచేస్తున్నామని యనమల తెలిపారు. బీసీ ఉప ప్రణాళిక కూడా పెట్టే ఆలోచన ఉందన్నారు. పరిశ్రమలకు రాయితీలు, ఉద్యోగాల కల్పనను పొందుపరుస్తామన్నారు. బ్జడెట్‌ ప్రవేశపెట్టేలోగా సీఎం దిల్లీ వెళ్లి కేంద్రంతో చర్చిస్తారని యనమల తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *