Tuesday, 3 November 2026

ఆప్‌ కన్వీనర్‌ పదవి నుంచి తప్పుకోనున్న కేజీవ్రాల్‌

న్యూఢిల్లీ,మార్చి2(జ‌నంసాక్షి): ఆమ్‌ఆద్మీపార్టీ జాతీయ కన్వీనర్‌ బాధ్యతల నుంచి పార్టీ అధినేత ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్ను పక్కన పెట్టేందుకు సర్వం సిద్ధం చేస్తున్నామని ఆ పార్టీ నేత సంజయ్‌ సింగ్‌ తెలిపారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ ఈ నెల 4న పార్టీ కార్యవర్గ సమావేశం జరగనుందని చెప్పారు. పార్టీలో సీనియర్‌ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తే పాలనను సజావుగా చేయడం అంత సులువు కాదని, వారు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనుకుంటే ఏమి చేయలేమన్నారు. వారి అసంతృప్తుల విషయంలో చర్చలు జరుపుతామని చెప్పారు. పార్టీలో విభేదాల విషయంపై మార్చి 4న అంతర్గతంగా చర్చించుకుంటాం తప్ప బహిరంగంగా కాదని స్పష్టం చేశారు. ఢిల్లీ సీఎంగా, పార్టీ జాతీయ కన్వీనర్‌ గా రెండు పదవుల్లో కేజీవ్రాల్‌ కొనసాగడంపై కొందరు నేతలు ఇటీవల అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. దాంతో కేజీవ్రాల్‌ గత గురువారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తన రాజీనామాను సమర్పించారు. అయితే కొందరు నేతలు ఆయనను నిలువరించారు. అయితే ప్రభుత్వం సమర్థంగా నడిపేందుకు ఆయన కన్వీనర్‌ బాధ్యతలనుంచి తప్పుకుంటామని తెలిపారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *