Tuesday, 3 November 2026

రాష్ట్ర సాధనలో అమరులైన వారిని స్మరించుకుందాం -బెటాలియన్ కమాండెంట్ బి. రామ్ ప్రకాష్

 

ఇటిక్యాల (జనంసాక్షి) జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారిని స్మరించుకోవాలని బెటాలియన్ కమాండెంట్ బి. రామ్ ప్రకాష్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బీచుపల్లి పదవ బెటాలియన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని కమాండెంట్ బి. రామ్ ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ బి. రామ్ ప్రకాష్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడీజీపీ స్వాతి లక్రా ఆదేశాల మేరకు ఈ సంవత్సరం పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులను శాలువా, మెమొంటో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ అనిల్ కుమార్, బెటాలియన్ ఆర్ఐలు రాజు, గోపాల్, తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.