Thursday, 5 November 2026

రాహుల్‌ పార్టీ అధ్యక్షుడయ్యాక కాంగ్రెస్‌కు నష్టం: షానవాజ్‌

హైదరాబాద్‌ ,మే10(జ‌నం సాక్షి):  రాహుల్‌ అధ్యక్షుడయ్యాక కాంగ్రెస్‌ పార్టీ నష్టపోయిందని బిజెపి అధికార ప్రతినిధి షానవాజ్‌ హుస్సేన్‌ అన్నారు. 2019 ఎన్నికల తర్వాత తాను ప్రధానిని అవుతానని రాహుల్‌ కలలు కంటున్నారని, అది నిజం కాబోదన్నారు. మరోసాని నరేంద్ర మోదీయే ప్రధాని అవుతారని పేర్కొన్నారు. హైదరాబాద్‌ వచ్చిన షానవాజ్‌ హుస్సేన్‌ పార్టీ కార్యాలయంలో విూడియాతో మాట్లాడారు. రాహుల్‌ గాంధీ తనకు తానే పీఎం అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. ఆయన్ను పీఎంగా చేసేవారు ఎవరూ లేరక్కడ. ప్రధాని అవుతానని కలలు కనే హక్కు ఆయనకు ఉంది. కానీ, ప్రజలు మాత్రం ఆయన్ను ప్రధానిగా ఎన్నుకోరు అని హుస్సేన్‌ అన్నారు. ఇకపోతే కర్నాటకలో బిజెపి గెలుపు ఖాయమన్నారు. కాంగ్రెస్‌కు పరాభవం తప్పదన్నారు.