రాహుల్ గాంధీ అనర్హత వేటు ను తీవ్రంగా ఖండించిన – కాంగ్రెస్ పార్టీ భువనగిరి అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అవేజ్ చిస్తి..
భువనగిరి టౌన్ మార్చ్25( జనం సాక్షి)రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడాన్ని భువనగిరి యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు అవేజ్ చిస్తీ తీవ్రంగా ఖండించారు,భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఆ రోజుచీకటిరోజు అని అన్నారు, రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం నరేంద్రమోదీ దురంహంకారానికి, నియంతృత్వానికి, పరాకాష్ట అన్నారు, రాజ్యాంగబద్ద సంస్థలను దురుపయోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంట్ ను సైతం తమ హేయమైన చర్యలకోసం బిజెపి మోదీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయ మని అన్నారు, ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించింద ని అన్నారు, మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతున్నదని, ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయిందని అన్నారు,నేరస్థులు, దగాకోరుల కొసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ తన పతనాన్ని తానే కొనితెచ్చుకుంటున్నార ని అన్నారు,పార్టీల మధ్య వుండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదని అన్నారు,దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బిజేపి ప్రభుత్వ దుశ్చర్యను వనుకోవాలని ప్రజాస్వామ్య వాదులందరూ కలిసి కట్టుగా ముక్తకంఠంతో ఖండించాలని అన్నారు, బిజేపి దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలని బి జె పి వ్యతిరేక పార్టీలకు పిలుపునిచ్చారు. బిజెపి కుళ్లు కుతంత్రాలతో రాహుల్ గాంధీ జోడోయాత్రను ప్రజల స్పందన చూసి బిజెపి ఊర్వలేక ఇలాంటి చర్యలకు పూనుకుంటుందని అన్నారు భారతదేశంలో బిజెపి పాలన అవలంబిస్తున్న తీరును ప్రతిఘటిస్తూ జోడుయాత్రలు ప్రజలకు బ్రహ్మరథం పడుతు స్వాగతిస్తున్నారు మోడీ అమిత్ షా పాలనలో ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ బడాబాబులకు ఆదాని అంబానీ అప్పజెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతు నొక్కి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని అన్నారు మోడీ కేంద్ర ప్రభుత్వంలో ప్రజా సామాన్య ప్రజలు నిత్యవసర సరుకులు పెంచి సామాన్యుడు బతకలేని పరిస్థితి ఉందని అన్నారు చదువుకున్న ఈ తరం నిరుద్యోగి కి గాని ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రాహుల్ జోడో యాత్రను అడ్డుకోలేక. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం పై అనర్హత వేటు వేయడం ఇలాంటి సిగ్గుమాలిన చర్యలకు పాల్పడుతున్న మోడీ ప్రభుత్వం కి రాబోయే కాలంలో ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు .. ఒదిక్కు రాహుల్ గాంధీ జోడు యాత్ర లో ప్రజాలు ఎక్కడికి వెళ్లిన అక్కడ ప్రజలు స్వాగతం పలుకుతున్నారు .
రాహుల్ గాంధీ అనర్హత వేటు ను తీవ్రంగా ఖండించిన – కాంగ్రెస్ పార్టీ భువనగిరి అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అవేజ్ చిస్తి..




