రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దు పై కాంగ్రెస్ నాయకుల ఆందోళన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం… –టిపిసిసి డెలిగేట్ మెంబర్ తంగాలపల్లి రవికుమారభువనగిరి టౌన్ (జనం సాక్షి):–మార్చి29. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పై అనర్హత వెయిట్ వేయడం రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీసింది ప్రతిపక్ష నేతలపై కేంద్ర ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతుందని రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దు పై మంగళవారం టిపిసిసి డెలికేట్ మెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ ప్రాథమిక సిద్ధాంతాలకు వ్యతిరేకమైన చర్య ప్రజాస్వామ్య విలువలను దిగజార్చడమే అని ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకునేందుకు ప్రజలంతా పార్టీలకు అతీతంగా ఏకమై కలసి కట్టుగా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని అన్నారు.రాహుల్ గాంధీ నిజాలు మాట్లాడుతూ రాజ్యాంగ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న నేపథ్యంలో ఆయనను అనర్హుడిగా చేయడానికి భజప అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిందని బజాపా తీరుపై మండిపడ్డారు. దేశాన్ని దోచుకుంటున్న దొంగను దొంగ అని పిలవడం కూడా నేరమైంది నియంతృత్వ పాలనకు ముగింపు పలికే విధంగా పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. దేశ సంపదను మింగేస్తున్న బజాప కు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు వారికి రాబోయే కాలంలో ప్రజలే తగిన గుణపాఠ చెప్తారని తెలిపారు .
రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దు పై కాంగ్రెస్ నాయకుల ఆందోళన




