రిజర్వేషన్లను తుంగాలో తొక్కే ప్రయత్నాన్ని అడ్డుకుంటాం-లైవ్ జిల్లా అధ్యక్షుడు.
నెరడిగొండసెప్టెంబర్1(జనంసాక్షి ):తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్
ద్వారా ఇటీవల నిర్వహించిన
ఎస్ఐ,కానిస్టేబుల్ ఉద్యోగ అర్హత పరీక్షల అమలులో రాజ్యాంగ విలువలను తుంగలోకి తొక్కిరిజర్వేషన్లను అంతం చెసే దిశగా రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారులు చేసిన కుట్రలను తిప్పికొట్టే విధంగా ప్రతి ఒక్కరు నడుంబించాలని ఆదిలాబాద్ జిల్లా లైవ్ అధ్యక్షుడు మహేందర్ జాధవ్ అన్నారు.రాజ్యాంగ విలువలను రిజర్వేషన్ మూలాలను తుంగాలో తొక్కే ప్రయత్నాన్ని ప్రభుత్వంనిలిపివేయాలని,పరీక్ష రాసిన ఎస్సి ఎస్టీ అభ్యర్థుల నిర్ణితమైన అర్హత మార్కులను తగ్గించాలని ఇందులో భాగంగా గురువారం రోజున మండల రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు.వారు మాట్లాడుతూరాజ్యాంగ బద్దంగా రావలసిన రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు.లేనిపక్షంలో న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని అన్నారు.