రిజర్వేషన్ల పితామహుడు బిపి మండల్
జనంసాక్షి , కమాన్ పూర్ : రిజర్వేషన్లను ఏర్పాటు చేసిన పితామహుడు బీబీ మండల్ అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నల్లవెల్లి శంకర్ అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో బిపి మండల్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బిందెశ్వర్ ప్రసాద్ మండల్ 105వ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లకు హాజరు బీసీల ఆరాధ్యులు బిందెశ్వర ప్రసాద్ మండలాన్ని ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా బీపీ మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీపి సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు పొన్నం నవీన్ కుమార్, మెడగొని విజయ్ కుమార్ గౌడ్,నగునూరి నర్సయ్య గౌడ్, కమ్మగోని అనిల్,నరిగే మల్లేష్,బంగారు గట్టయ్య,గొర్రెపెళ్లి వెంకన్న, మట్ట శంకర్, మట్ట నర్సయ్య,మెరుగు కుమార్, గుంజపడుగు నవీన్ కుమార్,మట్ట రాజయ్య, జంగపల్లి శేఖర్, తాటికొండ వెంకటేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.