రిజర్వేషన్ అమలు హర్షనీయం

యూత్ అధ్యక్షుడు హరీష్ నాయక్

డోర్నకల్ అక్టోబర్ 1 జనం సాక్షి

గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేయడంతో నిరుద్యోగులు,విద్యార్థులు,ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయని మండల యూత్ అధ్యక్షులు ఆంగోత్ హరీష్ నాయక్ ఓ ప్రకటనలు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన రిజర్వేషన్ పెంపుతో అనేక గిరిజన కుటుంబాల్లో కేసీఆర్ వెలుగులు నింపారని ప్రశంసించారు.గిరిజనుల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.ఏ ముఖ్యమంత్రి చేయలేని అభివృద్ధి కేసీఆర్ చేస్తున్నారని కొనియాడారు.దేశం యావత్తు తెలంగాణ వైపు చూస్తున్నారు. తెలంగాణ అంటే కెసిఆర్.. కెసిఆర్ అంటే తెలంగాణగా మారిందన్నారు.గిరిజనుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.