రిపోర్టర్ పై దాడిని తీవ్రంగా ఖండించిన న్యుడెమోక్రసీ పార్టీ

గంగారం అక్టోబర్ 10 (జనం సాక్షి)
గంగారం మండలం. మన తెలంగాణ రిపోర్టర్ పల్లె సురేష్ పై ఫారెస్ట్ అధికారి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు ఖండించారు గంగారం మండలం చింతగూడెం గ్రామ పరిధిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేష్ మన తెలంగాణ రిపోర్టర్ పై దాడి చేయడానికి హేయమైన చర్య. అని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ గంగారం కొత్తగూడ మండలాల కమిటీ కార్యదర్శి కామ్రేడ్ పుల్లన్న అన్నారు. ఫారెస్ట్ అధికారుల పాతవిక చర్యల మూలాన.ఏజెన్సీ ప్రాంతంలో జీవించే ఆదివాసీలు అమాయక ప్రజలు ఎంతోమంది వేదనకు గురవుతున్న స్థితిని వాస్తవ పరిస్థితులని వెలికి తీసి ప్రజలను చైతన్యవంతం చేసే ఒక బాధ్యతయుతమైన జర్నలిస్టులపై దాడులు చేయడం సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఈ దాడిని ప్రజలు ప్రజాస్వామికవాదులు ఖండించాలని కోరుతూ ఈ దాడికి పాల్పడిన బీట్ ఆఫీసర్ రమేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పుల్లన్న డిమాండ్ చేశారు.