Wednesday, 4 November 2026

రిలే నిరాహార దీక్షను చేపట్టిన: నియోజకవర్గ ఇన్చార్జి నక్క విజయ్

రిలే నిరాహార దీక్షను చేపట్టిన: నియోజకవర్గ ఇన్చార్జి నక్క విజయ్…మంత్రి కేటీఆర్ ను వెంటనే మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలి. TS PSC ని వెంటనే రద్దు చేయాలి గ్రూప్ వన్ అభ్యర్థులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించాలి టిఎస్పిఎస్సి చైర్మన్ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.ధర్మపురి లో బహుజన సమాజ్ పార్టీ రిలే నిరాహార దీక్ష సోమవారం ఉదయం తహశీల్దార్ ఆఫీస్ ముందు నియోజకవర్గ ఇన్చార్జ్ నక్క విజయ్ ఆధ్వర్యంలో,పార్టీ పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల అవలంబిస్తున్న వ్యతిరేక విధానాల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి సోమవారం ఉదయం ధర్మపురి లో రిలే నిరాహార దీక్షను చేపట్టారు. నియోజకవర్గ ఇన్చార్జ్ నక్క విజయ్ మాట్లాడుతూ,తెలంగాణ తెచ్చుకోవడానికి ఎక్కడైతే ఉద్యమం పోరాటం చేసినామో అక్కడి నుండే మళ్లీ విద్యార్థులు కేసీఆర్ ను గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారు,ఐటీ మంత్రి కేటీఆర్ ను మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని, నిరుద్యోగులకు లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని లీకేజి విషయమై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ, బహుజన సమాజ్ పార్టీ రిలే నిరాహార దీక్ష ను, అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు, పార్టీ చేపట్టిన నిరుద్యోగ యువతకు విద్యార్థులకు తెలంగాణ ప్రజానీకానికి బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుండి నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని,అందులో భాగంగానే నోటిఫికేషన్లు ఇవ్వడంలేదని ఇచ్చిన నోటిఫికేషనలపై కోర్టుకు వెళ్లి స్టేలు తేవడం మరియు ప్రశ్నాపత్రాలు లీకులు మొదలగు విషయాలు నిరుద్యోగుల పట్ల శాపంగా మారిందని, వారి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయని అన్నారు. నిరుద్యోగ నిర్మూలన అంటూనే మరోపక్క ఉద్యోగుల వయోపరిమితి మూడేళ్లు పెంచి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోంది అని, ఉపాధి హామీలో పని చేసే క్షేత్ర సహాయకులను 12,000 మందిని తొలగించి రెండేళ్ల పాటు వాళ్ళ జీవితాలను రోడ్డుపాలు చేసిందని అన్నారు. అంతే కాకుండా ముఖ్యమైన రెవెన్యూ శాఖను పెద్దల పాలు చేయడానికి వీఆర్వో వ్యవస్థను రద్దుచేసి మిగతా శాఖలో విలీనం చేసి నిరుద్యోగుల్లో నిరాశ నింపిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అందుకే నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన దీక్షకు మద్దతు కు అన్ని రాజకీయ పార్టీలు కలసి రావాలని, జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జ్ నక్క విజయ్ అన్నారు.