Tuesday, 3 November 2026

రీడింగ్ రూమ్ ను ఏర్పాటు చేసిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

మంథని, జనంసాక్షి :
మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంథని లోని సీతారామ సేవసదన్ మంజునాథ నిలయం అయ్యప్ప టెంపుల్ పక్కన ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షల కోసం సిద్ధం అవుతున్న విద్యార్థిని విద్యార్థుల కోసం రీడింగ్ రూమ్ ను సీతారామ సేవా సదన్ వైస్ ప్రెసిడెంట్ కొల్లారపు శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పాల్గొని మాట్లాడుతూ.. ఉద్యోగాల కోసం పోటీపడే నిరుద్యోగ యువత కోసం పీజేఆర్ వారిచే 60 రోజుల పాటు కోచింగ్ సెంటర్ తో ఉచిత శిక్షణ ఇప్పించి రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం విడుదల చేసే ఉద్యోగాలలో మంథని నియోజక వర్గ యువత ముందుండాలని సీతారామ సేవా సదన్ సహకారంతో రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉద్యోగాల కోసం పోటీపడే యువత రీడింగ్ రూమ్ సదుపాయాన్ని ఉపయోగించుకొని ఉద్యోగాలు సాధించాలని సంకల్పనతో ఏర్పాటు చేశామని తెలిపారు. వివిధ ఉద్యోగాల పోటీ పరీక్షలలో పాల్గొనడానికి అన్ని రకాల బుక్స్ ను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు