ఎల్బీనగర్ (జనం సాక్షి ) భోజన ప్రియులకు రుచి శుచితో కూడిన ఆహార పదార్థాలను అందజేయాలని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు . ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ పరిధిలోని భూపేష్ గుప్త నగర్ టీకేఆర్ కాలేజ్ రోడ్డులో నిర్వాహకులు సుజనా , సుధారాణిలు నూతనంగా ఏర్పాటు చేసిన డాడినో జైల్ రెస్టారెంట్ ను మహేశ్వరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు . మాట్లాడుతూ కాలానుగుణంగా వస్తున్న మార్పులతో పాటు ఆధునిక ప్రపంచంలో అనేక కొత్త రకమైన హోటల్స్ రావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ ‘డాడినో జైల్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేసిన వీరందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతూ కొత్త కొత్త రుచులను సామాన్య ధరలో అందుబాటులోకి తెస్తున్న యాజమాన్యానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు….ఈ కార్యక్రమంలో పలువురు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కంచర్ల శివారెడ్డి డె రంగుల కృష్ణ ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగినది
రుచి శుచితో కూడిన ఆహార పదార్థాలకు కేరాఫ్ ‘డాడినో జైల్ రెస్టారెంట్ ‘మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి




