హైదరాబాద్: రుణమాఫీపై ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తొలి ఏడాది పాలనలో వ్యవసాయశాఖ పనితీరుపై మంత్రి స్పందిస్తూ.. ప్రభుత్వంపై వ్యంగ్యంగా మాట్లాడేవారికి సర్కారు పనితీరే సమాధానం అని స్పష్టం చేశారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులకు ఒరిగిందేమీ లేదు. విద్యుత్ కోతలు, రైతుల ఆత్మహత్యలు కాంగ్రెస్ పాపమే అని ఏడాది కాలంలో వ్యవసాయరంగం ప్రగతి వైపు అడుగులు వేస్తుందని ఆయన పేర్కొన్నారు.




