రుద్రంగి పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన డిఈఓ

రుద్రంగి ఆగస్టు 26 (జనం సాక్షి);
రుద్రంగి మండల కేంద్రంలో గల హైస్కూల్ మరియు ప్రాథమిక పాఠశాలలను శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారి ధనాలకోట రాధాకిషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా రుద్రంగి మండలంలోని పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించడం జరిగింది.అలాగే మన ఊరు మనబడి కార్యక్రమంలో జరిగే పనులను పరిశీలించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్ దీక్షిత్,ప్రధానోపాధ్యాయులు ఎం.ఐ.సి యెల్ల గంగాధర్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.