Tuesday, 3 November 2026

*రూమ్ టు రీడ్ స్వచ్ఛంద సంస్థ పూర్వ విద్యార్థుల సమ్మేళనం*

మద్దూర్ (జనంసాక్షి): నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో రూమ్ టు రీడ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో  పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ లో భాగమైన మొదటి  సంవత్సరం విద్యార్థులు వందమంది భూనేడు, నిర్జింత సర్జఖాన్పేట్ గ్రామం  నుంచి విద్యార్థినిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ అర్జున్ కుమార్  కెరీర్ గైడెన్స్ ఇంటర్వ్యూ పై  అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో ఎంపిడిఓ విజయలక్ష్మి  మాట్లాడుతూ విద్యార్థులు ప్రస్తుత సాంకేతికత మరియు రూమ్  టు రీడ్ వారు అందించిన నైపుణ్యాలు ఉపయోగించుకుని మరింత అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన  విద్యార్థులు అందరికీ రూమ్ టు రీడ్ వారు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రోగ్రాం అసోసియేట్ లక్ష్మణ్, రూమ్ టు రీడ్ ప్రతినిధులు యమునా, సాయిబాబా, మమత లలిత తదితరులు పాల్గొన్నారు.