Friday, 6 November 2026

రూ. 1.12 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మేయర్

హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 14 జనంసాక్షి :    నగరంలో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.బుధవారం ఖైరతాబాద్ జోన్ జూబ్లీహిల్స్ లో వార్డు లో  రూ.1.12 కోట్ల వ్యయంతో 6 సీసీ రోడ్డు పనులకు మేయర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ…  నాణ్యత  ప్రమాణాలతో  పనులను  చేపట్టాలని అధికారులకు సూచించారు. వార్డు నెం.93లో రూ. 112.50 లక్షల తో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఆమె ప్రారంభించారు. ఆనంద్ నగర్ లో పి.జె.ఆర్ విగ్రహం నుండి అపోలో ఫార్మసి  బంజారాహిల్స్ వరకు రూ. 35 లక్షలతో సిసి రోడ్డు పనులు, వై.ఎస్.ఆర్ భవన్ నుండి రాంనగర్ రోడ్ నెం.13 బంజారాహిల్స్ వరకు రూ. 45 లక్షలతో సిసి రోడ్డు పనులు,  ఆనంద్ నగర్ క్రిష్ణ ప్లే స్కూల్ వద్ద రూ. 8 లక్షలతో సిసి రోడ్డు పనులు, బంజారాహిల్స్ రోడ్ నెం. 11 లేక్ వ్యాలీ హౌసింగ్ సొసైటీ వద్ద రూ. 11.70 లక్షల వ్యయంతో వి.డి.సి.సి రోడ్డు నిర్మాణం, బంజారాహిల్స్ లోని ప్రేమ్ నగర్ పి.జె.ఆర్ విగ్రహం వద్ద రూ. 4.30 లక్షల వ్యయంతో  పైప్ లైన్ పనులు ప్రారంభించారు. బంజారాహిల్స్ రోడ్ నెం.12 లోని ఆనంద్ బంజారా కాలనీ కవాసకి షోరూం వద్ద రూ.8.50 లక్షల వ్యయంతో ఫుట్ పాత్,  సీసీ రోడ్డు నిర్మాణం పనులను మేయర్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో  ఎస్.సి రత్నాకర్,  డి సి రజనీ కాంత్ రెడ్డి, ఇ ఇ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.