Tuesday, 3 November 2026

రూ. 10కే మట్టిగణపతి

సబ్సిడీ ధరలకు విగ్రహాలు విక్రయించనున్న టీపీసీబీ
హైదరాబాద్‌ సిటీ : పర్యావరణ గణపతులను తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియత్రణ మండలి (టీపీసీబీ) అందుబాటులోకి తీసుకురానుంది. ఐదు నుంచి ఏడు ఇంచుల మట్టిగణపతులను రూ.10కే ప్రజలకు అమ్మడానికి ఏర్పాట్లు చేస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కనీసం 20వేల విగ్రహాలను సబ్సిడీ ధరలకు, మరో 30వేల విగ్రహాలను సబ్సిడీ లేకుండా విక్రయించాలని నిర్ణయం తీసుకుంది.సెప్టెంబరు రెండో వారం నుంచి పర్యావరణ గణపతుల విక్రయాలు జరపడానికి ఎన్‌జీవో సంస్థలతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. టీపీసీబీ అధికారులు నేషనల్‌ గ్రీన్‌కార్ప్స్‌, ప్రభుత్వ విభాగాలు, ఎన్‌జీవో సంస్థల భాగస్వామ్యంతో మట్టిగణపతుల విక్రయాలు చేపట్టనున్నారు. గ్రేటర్‌లో రామకృష్ణాపురం, కూకట్‌పల్లి, సనత్‌నగర్‌, ఎర్రగడ్డ, అమీర్‌పేట, సికింద్రాబాద్‌ గణేశ్‌ దేవాలయం, నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌, మెహిదీపట్నం రైతుబజార్‌, లుంబినీపార్కు, కోఠి, ఎన్‌టీఆర్‌ మార్గ్‌, సరూర్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌, తార్నాక, హబ్సిగూడ, దిల్‌సుఖ్‌నగర్‌, నాగోల్‌ , అత్తాపూర్‌, మాల్కాజగిరి, నాచారం, షాపూర్‌నగర్‌లలో మట్టి విగ్రహాల స్టాల్స్‌ ఏర్పాటు చేయనున్నారు. ప్రజల అవసరాల మేరకు మట్టి విగ్రహాలను ప్రభుత్వ సంస్థలు సరఫరా చేయలేకపోతున్నట్టు పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *