తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఐదెకరాల విస్తీర్ణంలో రూ.5 కోట్ల వ్యయం తో ఆర్టీఏ శిక్షణా కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి మహేం దర్ రెడ్డి తెలిపారు. జిల్లాకు ఒకటి కావాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరిని కోరగా అందుకు ఆయన సమ్మతిం చారని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆ కేంద్రాల్లో శిక్షణ అనంతరం లైసె న్సులు కూడ ఇస్తారన్నారు. సోమవారం ఆయన మండలి చైర్మన్ స్వామిగౌడ్‌తో కలసి మణికొండలో రంగారెడ్డి ఉప రవాణ కమిషనర్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సిరిసిల్లలో రూ.18 కోట్ల వ్యయంతో శిక్షణా కేంద్ర ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే తాండూర్, పరిగిలలో ఆర్టీఎ కార్యలయాలను మంజూరు చేశామని ఇతర జిల్లాలో కూడ త్వరలో కొత్త కార్యా లయాలు వస్తాయని అన్నారు. మణికొండ కార్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలలో ఆరు కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాజేందర్‌నగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, రాంచం దర్‌రావు, జడ్పీటీసీ సభ్యురాలు ముంగి జ్యోతి, ఎంపీపీ మల్లేష్, సర్పంచ్‌లు నరేందర్‌రెడ్డి, నర్సింహ, ఎంపీటీసీ సభ్యులు రామకృష్ణారెడ్డి, రాఘవరెడ్డి, సురేష్, మహేందర్, ట్రాన్స్‌పోర్టు కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానీయా, రంగారెడ్డి జిల్లా రవాణా ఉప కమిషనర్ ప్రవీన్‌రావు తదితరులు పాల్గొన్నారు.




