Wednesday, 4 November 2026

నిరుద్యోగ యువతకు ఒకేషనల్‌ కోర్సుల్లో శిక్షణ

హైదరాబాద్‌ సిటీ: నిరుద్యోగ యువతకు కన్‌స్ట్రక్షన్‌ ఇండస్ర్టీ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ యందు వివిధ కోర్సులలో ఒకే షనల్‌ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా యువజన సంక్షేమాధికారి ఎస్‌.మోతీలాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 25లోగా తమ దరఖాస్తులను నాం పల్లిలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. జీడబ్ల్యూఎస్‌, ప్లంబింగ్‌ అండ్‌ సానిటేషన్‌, మేస్ర్తీ కోర్సులలో 3 నెలల శిక్షణ ఉంటుందని, ప్లంబింగ్‌ అండ్‌ సానిటేషన్‌, మేస్ర్తీ కోర్సులకు 8 వ తరగతి, జీడబ్యూఎస్‌నకు ఇంటర్మీడియెట్‌ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులన్నారు. శిక్షణకు ఎలాంటి రుసుం ఉండదని, ఉచిత భోజన వ సతి సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. శిక్షణ కార్యక్ర మం బేగంపేట్‌, ఆర్యసమాజ్‌ వద్ద గల సీఐడీసీ ట్రైనింగ్‌ సెంటర్లో ఉంటుందని, శిక్షణ అనంతరం అర్హులైన అభ్యర్థులకు తగిన ప్లేస్‌మెంట్స్‌ను కల్పించడం జరుగుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *