కొత్తగూడెంలో పారిశ్రామికాభివృద్ధి బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. పాల్వంచలో కేటీఆర్ పర్యటనలో మాట్లాడుతూ.. పాల్వంచలో మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కొత్తగూడెం నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వారసత్వంగా వచ్చిన సమస్యల్ని కొత్త రాష్ట్రంలో అధిగమించేందుకు కృషి చేస్తున్నారు. గద్దెను ఎక్కాలన్నా ఆశతో వస్తన్న ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ధి చెప్పాలని తెలిపారు. వచ్చే రెండున్నరేళ్లలో సీతారామ ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందిస్తామన్నారు.
రెండున్నరేళ్లలో సీతారామ ప్రాజెక్టు




