Tuesday, 3 November 2026

ప్రొఫెసర్‌ లక్ష్మి అరెస్ట్

636147311823827972వైద్య విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్‌ లక్ష్మిని ఎట్టకేలకు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సాయంత్రంలోగా కోర్టులో హాజరుపర్చే అవకాశముంది. మెడికల్ విద్యార్థి సంధ్యారాణి ఆత్మహత్య కేసులో లక్ష్మి నిందితురాలు. గతకొద్ది రోజులుగా ఎవరికీ దొరకకుండా అజ్ఞాతంలో ఉన్న ఈమెను పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. ప్రొ. లక్ష్మిని అరెస్ట్ చేసిన పోలీసులను మంత్రి కామినేని శ్రీనివాస్, డీజీపీ అభినందించారు. సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి ఆమె పరారీలో ఉన్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *