Wednesday, 4 November 2026

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ:8మందికి గాయాలు..

హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలో మరో రోడ్డుప్రమాదం జరిగింది.. నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రి దగ్గర రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి.. ఈ ఘటనలో ఎనిమిదిమంది గాయపడ్డారు.. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.. ఈ బస్సుల్లో ఒకటి మణుగూరునుంచి హైదరాబాద్‌కు వస్తుందగా… మరో బస్సు హైదరాబాద్‌నుంచి విజయవాడ వెళుతోంది.. అతి వేగంతో గుద్దుకోవడంతో రెండు బస్సులు నుజ్జు నుజ్జయ్యాయి.. ఇదే జిల్లాలో బుధవారం రామన్నపేట వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో పదిమంది మృత్యువాత పడ్డారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *